Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మొబైల్ నెంబర్‌కు కాల్ చేయండి: డొనాల్డ్ ట్రంప్.. కొత్త చిక్కులు తప్పవా?

ఆరు ముస్లిం దేశాలపై నిషేధం, వీసా నిబంధనల్లో మార్పులు, సరిహద్దు గోడ నిర్మాణం వంటి నిర్ణయాలతో ప్రపంచ దేశాల ప్రజల నోళ్లల్లో నానుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం అమెరి

Webdunia
బుధవారం, 31 మే 2017 (16:05 IST)
ఆరు ముస్లిం దేశాలపై నిషేధం, వీసా నిబంధనల్లో మార్పులు, సరిహద్దు గోడ నిర్మాణం వంటి నిర్ణయాలతో ప్రపంచ దేశాల ప్రజల నోళ్లల్లో నానుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం అమెరికా ఉన్నతాధికారులను ఆందోళనలకు గురిచేస్తోంది. ట్రంప్‌ నేరుగా ఫోన్ చేయాలని నాయకులకు, అధికారులకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో మెక్సికో, కెనడా ప్రధానులకు తన ఫోన్ నెంబర్‌ను ఇచ్చారు. 
 
ఈ అవకాశాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడే బాగానే ఉపయోగించుకున్నారు. ట్రంప్‌తో నేరుగా ఫోన్లో మాట్లాడిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే ట్రంప్‌తో నేరుగా నేతలు ఫోనులో మాట్లాడటం ద్వారా దౌత్యపరమైన రహస్యాలు, భద్రతా చర్యలకు ఆటంకం కలిగే అవకాశం లేకపోలేదని అమెరికా కమ్యూనికేషన్స్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇలా ట్రంప్ ఫోటో కాల్‌ను పక్కనబెట్టి నేతలతో ఫోనులో మాట్లాడటం భద్రతా పరంగా మంచిది కాదని కమ్యూనికేషన్స్ అధికారులు అంటున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో ప్రధాన మంత్రులకు తన ఫోన్ నెంబర్ ఇచ్చిన ట్రంప్.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రోన్‌కు కూడా ఫోన్ నెంబర్ ఇచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments