Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో నీకెందుకు ఆ పాడుపని రోజమ్మా?... ఏం చేసింది?

తిరుమల. ఆధ్మాత్మిక క్షేత్రం. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వస్తూపోతూ ఉంటారు. తిరుమల గురించి తెలియని వారుండరు. తిరుమల అంటేనే కేవలం ఆధ్మాత్మికం. ఎలాంటి రాజకీయాలకు తావు లేదు. నిషేధిత

Webdunia
బుధవారం, 31 మే 2017 (14:34 IST)
తిరుమల. ఆధ్మాత్మిక క్షేత్రం. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వస్తూపోతూ ఉంటారు. తిరుమల గురించి తెలియని వారుండరు. తిరుమల అంటేనే కేవలం ఆధ్మాత్మికం. ఎలాంటి రాజకీయాలకు తావు లేదు. నిషేధిత వస్తువులూ బంద్. అలాంటి తిరుమలను కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడేసుకుంటున్నారు. అందులో ప్రధానంగా వైకాపా ఎమ్మెల్యే రోజా మొదటగా ఉన్నారు. 
 
తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చే రోజా ఆలయం బయటే రాజకీయాలు మాట్లాడుతూ ఆధ్మాత్మిక పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. ఇది ఇప్పటికి కాదు. ఆమె ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇదే తంతు. తాజాగా కొన్నిరోజుల క్రితం స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన రోజా చంద్రబాబుపై చేసిన అసభ్య కామెంట్‌పై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నారు. 
 
ఆ విషయంలో చంద్రబాబు కన్నా బాలకృష్ణే నయం. ఏ విషయం.. డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రోజా తిరుమలలో మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైజాగ్‌లో జరిగిన మహానాడుపై వ్యాఖ్యలు చేసిన ఆర్కే.రోజా తెలుగుదేశం పార్టీకి బాబు కన్నా బాలకృష్ణే నయమన్నారు. ఈ వ్యాఖ్యను మరో ద్వందార్థం వచ్చేవిధంగా వక్రీకరించారు. ఇదొక్కటే కాదు గతంలో ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎన్నో చేశారు. 
 
దీనిపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆధ్మాత్మిక క్షేత్రం పవిత్రత దెబ్బతినేలా రోజా ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు హిందూ ధార్మిక సంఘాలు. తిరుపతిలోని ప్రెస్‌క్లబ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన శివసేన పార్టీ నేతలు రోజా తీరును తప్పుబట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments