Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమాంటిక్ మూడ్‌లో న్యూ కపుల్స్... వరుడు తలపాగాను లాగేసిన జిరాఫీ

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (11:15 IST)
వారిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత పర్యాటక అందాలు తిలకించేందుకు వెళ్లారు. అలా తిలకిస్తూ.. రొమాంటిక్ మూడ్‌లో నిలబడి ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన జిరాఫీ వరుడు పెట్టుకున్న తలపాగాను లాగేసింది. దీంతో ఆ జంట కాస్తంత ఆందోళనకు గురై, తలపాగాను అందుకునేందుకు పైకి ఎగిరారు. ఇంతలో ఎత్తుగా ఉండే ఓ వ్యక్తి వచ్చి ఆ తలపాగాను పట్టుకోవడంతో జిరాఫీ దాన్ని వదిలివేసింది. దీంతో కొత్త జంట ఊపిరి పీల్చుకుని నవ్వుల్లో మునిగిపోయారు. ఈ ఘటన కాలిఫోర్నియాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, భారత సంతతికి చెందిన అమీశ్, మేఘనాలకు వివాహం వైభవంగా జరుగగా, వారిద్దరూ ఫొటోలు తీయించుకునేందుకు మలీబు ప్రాంతంలోని సాడల్ రాక్ వద్దకు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ పోజులిస్తుండగా, పక్కనే ఉన్న ఫెన్సింగ్ వెనుక ఉన్న ఓ జిరాఫీ వారి వద్దకు వచ్చింది. 
 
అది ఏమైనా ఆకలితో వుందేమో... వరుడి తలపాగాను పట్టుకుంది. దీన్ని గమనించిన వధువు సిగ్గుపడుతూ జిరాఫీని వారించే ప్రయత్నం చేసినా, అది వినలేదు. ఈలోగా మరో వ్యక్తి వచ్చి, తలపాగాను జిరాఫీ నోటి నుంచి లాగేసి వరుడికి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments