Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ.. వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపుతారు.. చోరీ చేస్తే కాళ్లు నరికేస్తారు...

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (09:32 IST)
ప్రపంచ చిత్రపటంలో ఆ దేశాన్ని గుర్తించాలంటే దర్పణం వేసుకుని వెతకాల్సిందే. కానీ, ఆ దేశంలో అమలు చేసే చట్టాలు మాత్రం అత్యంత కఠినంగా ఉంటాయి. ఆ దేశం పేరు బ్రూనే. ఇపుడు అత్యంత కఠినమైన ఇస్లాం చట్టాలను అమలు చేయాలని నిర్ణయించింది. స్వలింగ సంపర్కం లేదా వ్యభిచారం చేసినా వారిని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అంటే ఈ నేరాలకు పాల్పడేవారిని చనిపోయేంతవరకు రాళ్లతో కొడతారు. 
 
ప్రస్తుతం ఈ దేశంలో సుల్తాన్ పాలన కొనసాగుతోంది. ఇపుడు అత్యంత కఠినమైన ఇస్లాం చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టాలపై అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా సుల్తాన్ హసనల్ బోల్కియా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాల్లో షరియా చట్టాన్ని జాతీయ స్థాయిలో అమలు చేసిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. 
 
బోర్నియో ద్వీపంలో ఉన్న దేశాల్లో ఇది ఒకటి. పైగా, ఇది అతి చిన్న దేశం. ఇక్కడ షరియా చట్టం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం... బ్రూనేలో గే సెక్స్, వ్యభిచారం నేరాలకు పాల్పడేవారిని మరణించే వరకు రాళ్ళతో కొట్టి శిక్షిస్తారు. దొంగతనం చేసినవారి చేతులు, పాదాలు నరికేస్తారు. రేప్, దొంగతనం వంటి నేరాలకు కూడా మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. ప్రవక్త మహమ్మద్‌‌ను అవమానించడం మరణ శిక్ష విధించదగిన నేరం. ఈ శిక్షలు ముస్లింలకు, ముస్లిమేతరులకు కూడా వర్తిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం