Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి మృతి.. అతడి వారసుడిని కనాలనుకుంది.. సోషల్ మీడియాలో వైరల్

రోడ్డు ప్రమాదంలో ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ ప్రేయసి అతనిని మరిచి.. కొత్త జీవితాన్ని ప్రారంభించలేదు. మరణించిన ప్రియుడి బిడ్డకు తల్లి కావాలనుకుంది. ఇందుకు కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (16:00 IST)
రోడ్డు ప్రమాదంలో ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ ప్రేయసి అతనిని మరిచి.. కొత్త జీవితాన్ని ప్రారంభించలేదు. మరణించిన ప్రియుడి బిడ్డకు తల్లి కావాలనుకుంది. ఇందుకు కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. డేవిస్, ఐలా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంతలోనే ఓ రోడ్డు ప్రమాదంలో డేవిస్ మృతి చెందాడు. అయితే ఐలా  అతనిని మర్చిపోయి కొత్తజీవితం ప్రారంభించలేదు. దీంతో తన ప్రియుడి వీర్యంతో పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంది.
 
ఐవీఎఫ్ పధ్ధతిలో డేవిస్ వారసుడిని కనాలని నిర్ణయించుకుంది. దీంతో ప్రియుడు మరణించిన కొన్ని గంటల్లోనే అతనితో పిల్లల్ని కనేందుకు అనుమతినివ్వాలని కోర్టుకు కోరింది. కోర్టు కూడా డేవిస్ వీర్యాన్నీ తీసి భద్రపరచాల్సిందిగా ఆదేశించింది. అనంతరం ఈ కేసుపై రెండు నెలల సుదీర్ఘ విచారణ జరిగింది. 
 
ఈ రెండు నెలల విచారణలో న్యాయస్థానానికి ఐలా ఎన్నో ఆధారాల‌ను స‌మ‌ర్పించింది. దీంతో డేవిస్ వీర్యంతో పిల్లల్ని కనేందుకు న్యాయస్థానం అనుమతించింది. కృత్రిమ గ‌ర్భ‌దార‌ణ విధానం ద్వారా ఓ క్లినిక్‌‌లో ఈ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని ఆదేశించింది. దీంతో సోషల్ మీడియాలో అరుదైన ప్రేమికురాలిగా ఐలా గుర్తింపు పొందింది. ఐలా లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments