Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ రైడింగ్ చేస్తే ట్రిపుల్ ఫైన్ చెల్లించాల్సిందే.. ఎక్కడ?

కొన్ని సందర్భాల్లో ద్విచక్రవాహనాల్లో ముగ్గురేసి ప్రయాణిస్తుంటారు. ఇలా ట్రిపుల్ రైడింగ్‌లో అమ్మాయిలు లేదా మహిళలు వెళుతుంటే మాత్రం పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తుంటారు.

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (15:54 IST)
కొన్ని సందర్భాల్లో ద్విచక్రవాహనాల్లో ముగ్గురేసి ప్రయాణిస్తుంటారు. ఇలా ట్రిపుల్ రైడింగ్‌లో అమ్మాయిలు లేదా మహిళలు వెళుతుంటే మాత్రం పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తుంటారు. ఇక నుంచి ఇలాంటివి జాన్తానై అంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. 
 
ట్రిపుల్ రైడింగ్‌కి జరిమానాగా వెయ్యి రూపాయలు ఇప్పటివరకు వసూలు చేసేవారు. ఇక నుంచి మూడు వేల రూపాయల ఫైన్ వేయనున్నారు. అంటే ట్రిపుల్ రైడింగ్ వెళితే ట్రిపుల్ ఫైన్ చెల్లించాల్సిందేనంటున్నారు. బండి నడిపే వ్యక్తికి వెయ్యి కట్టాల్సి ఉంటే.. వెనక కూర్చున్న ఇద్దరూ కూడా తలో వెయ్యి రూపాయలు జరిమానా కింద కట్టాలి. ఈ నిబంధనను త్వరలోనే అమలు చేయనున్నారు. 
 
దీనిపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ, ముఖ్యంగా యువతలో మార్పు కోసం ఈ కఠిన నిబంధన అమలు చేస్తున్నామన్నారు. మోటార్ వాహన చట్టం 188 కింద వెయ్యి ఫైన్ వసూలు చేస్తుండగా, యువతలో ఏమాత్రం మార్పు లేదన్నారు. అందుకే ట్రిపుల్ రైడింగ్‌లో ఉండే మిగతా ఇద్దరికీ ఫైన్ వేసే విధంగా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు తెలిపారు. 
 
ట్రిపుల్ రైడింగ్ చట్టాన్ని కఠినతరం చేస్తూ, ఈ నిబంధనలను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అమలు చేసే విధంగా నివేదికను తయారు చేశారు. బైక్ నడిపే వ్యక్తితోపాటు వెనక కూర్చున్న మిగతా ఇద్దరికీ కూడా చెరో వెయ్యి రూపాయల జరిమానా విధిస్తే.. మార్పు వస్తుందని భావిస్తున్నాం అంటున్నారు రాచకొండ అధికారులు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments