Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పుత్నిక్‌ టీకా వినియోగానికి బ్రెజిల్ నిరాకరణ

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (11:57 IST)
కరోనా వైరస్ తొలి దశ వ్యాప్తి సమయంలో చిగురుటాకులా వణికిపోయిన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఈ దేశం ఇపుడిపుడే కరోనా వైరస్ నుంచి కోలుకుంటోంది. ఈ క్రమంలో బ్రెజిల్‌లో కరోనా టీకీల వినియోగానికి అనుమతి ఇచ్చారు. అయితే, రష్యా కంపెనీ ఉత్పత్తి చేసిన స్పుత్నిక్-వి టికా వినియోగానికి బ్రెజిల్ అనుమతి నిరాకరించింది. ఇందుకు రక్షణపరమైన కారణాలు చూపింది. 
 
బ్రెజిల్‌లో అనేక రాష్ట్రాలు మహమ్మారితో అల్లాడుతుండగా దాదాపు మూడు కోట్ల స్పుత్నిక్‌ వ్యాక్సిన్లు తెప్పించుకునేందుకు విజ్ఞప్తులు పెట్టుకున్నాయి. ఈ క్రమంలో స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతుల విషయమై సమావేశమైన ఐదుగురు నిపుణుల బృందం అందుకు నిరాకరించింది. 
 
వ్యాక్సిన్‌ తయారీలో నిబంధనలు ఉల్లంఘించడం సహా తప్పుడు సమాచారాన్ని అందించారని బ్రెజిల్‌ ఔషధ నియంత్రణ సంస్థ ఆరోపించింది. స్పుత్నిక్‌-వి తయారీ కోసం వినియోగించిన అడినో వైరస్‌ టీకా తీసుకున్నవారిలో జ్వరం వంటి దుష్ప్రభావాలు కనిపించడం సహా కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయని బ్రెజిల్‌ ఔషధ నియంత్రణ సంస్థ ఆరోపించింది. 
 
బ్రెజిల్ ఆరోపణలపై రష్యా మండిపడింది. టీకాలో వినియోగించిన అడినో వైరస్‌ కారణంగా టీకా తీసుకున్నవారు దుష్ప్రభావాల బారిన పడిన దాఖలాలు ఏమీలేవని స్పష్టంచేసింది. బ్రెజిల్‌తో సంప్రదింపులు కొనసాగుతాయన్న రష్యా.. ఆ దేశం కోరిన సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. గతంలోనూ బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనారో టీకాలకు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments