Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు ఫణంగా పెట్టి మొసలి కళ్లు పీకేసి ఫ్రెండ్‌ను కాపాడింది...

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (13:38 IST)
ఓ యువతి తన ప్రాణాలు ఫణంగా పెట్టి తన స్నేహితురాలి ప్రాణాలను కాపాడింది. ఈ క్రమంలో మొసలి నేత్రాలను పీకేసింది. ఈ ఘటన జింబాబ్వేలోని సిందెరేలా అనే గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన రెబెకా ముంకోబ్వే అనే బాలిక తన స్నేహితులతో కలిసి సరదాగా చెరువు వద్దకు వెళ్లింది. స్నేహితురాళ్లంతా కలిసి అందులో ఈత కొడుతున్న సమయంలో లయోటా మౌవానీ (11) అనే బాలికను ఓ మొసలి లోపలికి లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని గుర్తించిన రెబెకా మొసలితో పోరాడింది.
 
మొసలిపైకి ఎక్కి పిడిగుద్దులు కురిపించి, దాని కళ్లు పీకేసింది. దీంతో తీవ్ర నొప్పితో మొసలి లయోటాను వదిలి నీళ్లలోకి వెళ్లింది. లయోటాను తన వీపుపైన ఎక్కించుకుని చెరువులోంచి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చి, ఆమె ప్రాణాలను కాపాడింది. లయోటాకు స్వల్పగాయాలు కావడంతో ఆమెను ఓ ఆసుపత్రికి తరలించారు. స్నేహితురాలిని కాపాడిన రెబెకాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
 
ఈ ఘటనపై రెబెక్కా మాట్లాడుతూ.. అక్కడ ఈత కొడుతున్న వారిలో తానే పెద్దమ్మాయిని. లటోయాను మొసలి పట్టుకునేసరికి ఆమెను కాపాడేందుకు ధైర్యం చేశాను. మొసలిపైకి దూకి కళ్లపై దాడి చేశారు. దీంతో అది కాస్త పట్టువదిలింది. లటోయా గాయాలతో మొసలి నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత ఇద్దరం చెరువు ఒడ్డుకు చేరుకున్నాం అని రెబెక్కా తెలిపింది. తన బిడ్డ ప్రాణాలతో బయటపడినందుకు లటోయా తండ్రి దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments