Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ ప్రధాని రేస్ నుంచి తప్పుకున్న బోరిస్ జాన్సన్

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (16:56 IST)
బ్రిటన్ తదుపరి ప్రధానిని ఎన్నుకునే ఎన్నికల రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. యూరోపియన్ దేశం బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ గత జూలైలో రాజీనామా చేశారు. అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు మాత్రమే ప్రధాని చేపట్టగలరు. 
 
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో, భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ను ఓడించి మాజీ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆమె తీసుకున్న ఆర్థిక చర్యలు దేశంలో గందరగోళం సృష్టించాయి. ఫలితంగా, 45 రోజుల పదవి తర్వాత లిజ్ ట్రస్ ఇటీవలే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. వచ్చే వారంలోగా పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది.
 
ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన 1.70 లక్షల మంది ప్రతినిధులు ఓటు వేయనున్నారు. పెన్నీ మోర్డార్ట్ అనే మహిళా ఎంపీ ఇప్పటికే ప్రధాని పదవి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. రిషి సునక్ కూడా తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయనకు పార్టీకి చెందిన 128 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు సమాచారం. 
 
ఈ పరిస్థితిలో, 100 మందికి పైగా ఎంపీల మద్దతు ఉందని చెప్పుకున్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని పదవి, కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో తదుపరి ప్రధానిగా రిషి సునక్ ఎన్నికయ్యే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments