Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో పురోగతి.. మురికి కాలువలో ఎముకలు లభ్యం!!

వరుణ్
ఆదివారం, 9 జూన్ 2024 (15:03 IST)
బంగ్లాదేశ్‌కు చెందిన ఎఁపీ అన్వర్ అజీమ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్య కేసులో బెంగాల్ పోలీసులు కొంత పురోగతి సాధించారు. మృతుడి ఎముకలను ఓ మురికి కాలువలో గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి కీలక అనుమానితుడిని నేపాల్‌లో అరెస్టు చేసిన పోలీసులు.. భారత్‌కు తీసుకువచ్చారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు గాలింపు చేపట్టిగా.. బాధితుడిగా భావిస్తోన్న శరీర భాగాల ఎముకలు లభ్యమయ్యాయి.
 
'వైద్యులు, ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో గాలింపు జరపగా.. ఆ కాలువలో మనిషికి సంబంధించిన ఎముకలు లభ్యమయ్యాయి. వాటిని ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం పంపిస్తాం. ఇతర శరీర భాగాల కోసం గాలింపు కొనసాగుతుంది' అని పోలీసులు వెల్లడించారు. అంతకుముందు ఎంపీ శరీరానికి సంబంధించినగా భావిస్తున్న దాదాపు మూడున్నర కిలోల మాంసపు ముద్దను హత్య జరిగిన అపార్టుమెంట్ సెప్టిక్‌ ట్యాంకులోనే గుర్తించారు.
 
బంగ్లా ఎంపీని హత్య చేసిన అనంతరం అతడి శరీర భాగాలను ముక్కలుగా చేసి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీటిలో కొన్ని ఇప్పటికే లభ్యం చేసుకున్నప్పటికీ.. అవి నిర్ధరించుకోవడం కష్టంగా మారింది. దీంతో డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం బాధిత ఎంపీ కుమార్తె బంగ్లాదేశ్‌ నుంచి కోల్‌కతాకు రానున్నారు. మరోవైపు, ఈ హత్య కోసం ఎంపీ సన్నిహితుడే నిందితులకు దాదాపు రూ.5 కోట్లు చెల్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments