Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలో మిలిటరీ బస్సుపై బాంబు దాడి.. 13మంది మృతి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (15:33 IST)
సిరియా రాజధాని డమస్కస్‌లో ఓ మిలిటరీ బస్సుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. జిసర్ అల్ రయిస్ బ్రిడ్జ్‌ను దాటుతున్న సమయంలో రెండు బాంబులతో వాహనాన్ని పేల్చేశారు. వాస్తవానికి సిరియాలో గత దశాబ్ధ కాలం నుంచి ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే ఉన్నది. అయితే ఇటీవల దేశ రాజధాని డమస్కస్‌లో మళ్లీ దాడి ఘటనలు పెరిగాయి. 
 
ఇడ్లిబ్ ప్రావిన్సులో ఉన్న అరిహ పట్టణంలో జరిగిన మరో దాడిలో అనేక మంది స్కూల్ విద్యార్థులు మృతిచెందినట్లు తెలుస్తోంది. అసద్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు 2011 నుంచి సిరియాలో ఉద్యమం నడుస్తోంది. ఇప్పటి వరకు ఆ పోరాటంలో 3.50 లక్షల మంది మరణించారు. సగం మంది జనాభా తమ స్వంత ఇండ్లను విడిచి వెళ్లారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments