Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్ జర్నీ అంటే కిమ్‌కు భయం.. అందుకే బుల్లెట్ ప్రూఫ్ రైలులో .. ఈ రైలు ప్రత్యేకతలెన్నో...

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (12:00 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తమ సొంత రైలులో రష్యాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇందుకోసం ఆయన రైలులో ప్రయాణించి మాస్కోకు చేరుకున్నారు. విమాన ప్రయాణమంటే భయపడే కిమ్... ఏకంగా 681 కిలోమీటర్ల దూరం రైలులోనే ప్రయాణం చేశారు. తమ తండ్రి, తాతలకు గౌరవ సూచకంగానే తమ అధినేత రైలు ప్రయాణం చేస్తుంటారని నార్త్ కొరియా ప్రకటించింది. 
 
ఈ బుల్లెట్ ప్రూఫ్ రైలు వస్తుంటే మిగిలిన రైళ్లు ఎక్కడివక్కడే ఆగిపోవాల్సిందే. కిమ్ ప్రయాణించే మార్గంలో స్టేషన్లకు సైనికులు ముందే చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అందులో భాగంగా రైల్వే స్టేషన్లలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో రైళ్లన్నీ ఎక్కకడివి అక్కడే ఆగిపోయారు. భద్రత కోసం చేసిన ఏర్పాట్ల వల్ల ఈ ప్రత్యేక రైలు వేగం చాలా తక్కువ. గరిష్టంగా గంటకు 59 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణం చేస్తుంది. 
 
ఇందులో కిమ్‌ ప్రయాణించే కార్లు కూడా ఉంటాయి. రైలులో మొత్తం 91 కోచ్‌లు ఉంటాయి. లోపల అధ్యక్షుడి కోసం విలాసవంతమైన ఏర్పాట్లు, పొడవైన టేబుళ్లు, ఫ్లాట్ స్క్రీన్ మానిటర్లను అమర్చారు. ట్రాక్‌లను పరీక్షిస్తూ ఓ ట్రైన్ ముందు వెళుతుంటే, ఆ తర్వాత భద్రతా సిబ్బందిని మోసుకుంటూ మరో ట్రైన్ వెళుతుంది. వీటి వెనుక కిమ్ ప్రయాణించే రైలు వెళుతుంది. ఇందులో రష్యాన్, ఫ్రెంచ్, జపనీస్, కొరియన్, చైనీస్ వంటకాలు అప్పటికపుడు వండి వడ్డించేలా ఏర్పాట్లు ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments