Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్షి పిల్ల నోటిలో సిగరెట్ ముక్క.. వైరల్ అవుతున్న ఫోటో..

Webdunia
బుధవారం, 3 జులై 2019 (18:40 IST)
అమెరికాలో ఓ పక్షి తన పిల్లకు సిగరెట్ బడ్స్ తినిపించే ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో బ్లాక్ స్కిమ్మర్ పక్షి.. తన పిల్లకు సిగరెట్ బడ్స్ తినిపించే ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
ఈ ఫోటో వైరల్ కావడం పక్కన బెడితే.. మానవుల తప్పిదాలను కూడా ఎత్తిచూపుతోంది. సిగరెట్‌లోని దూదిని ఆహారంగా భావించి పక్షులు తన పిల్లలకు అందించడం ద్వారా పక్షులకు మానవులు మంచి చేసిన వారవుతారా అనే కోణంలో ఈ ఫోటోపై చర్చ సాగుతోంది. 
 
గత 39 సంవత్సరాల్లో సముద్ర తీరాల్లో మాత్రం 60 మిలియన్ల సిగరెట్ బడ్స్‌ను తొలగించినట్లు ఓ అధ్యయనం తేలింది. ఈ ప్రపంచం మానవుల కోసం మాత్రమే సృష్టించబడలేదని, పక్షులు, జంతువులకు కూడా సొంతమని.. సామాజిక వేత్తలు ఈ ఫోటోను షేర్ చేస్తూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఫోటోను చూసిన తర్వాతైనా మానవులు నడుం బిగించాలని వారు హితవు పలుకుతున్నారు. ఈ ఫోటోను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కరెన్ మోసన్ తన కెమెరాలో బంధించి.. ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఇకపై సిగరెట్ కాల్చితే మిగిలిన ముక్కను ఇలా పారేయకండి అంటూ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments