Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివో జడ్1ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల...

Webdunia
బుధవారం, 3 జులై 2019 (17:58 IST)
మొబైల్స్ తయారీదారు సంస్థ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ జడ్1 ప్రొను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్‌తో పాటు 32 మెగాపిక్సెల్ ఇన్‌స్క్రీన్ కెమెరాను అమర్చారు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ గల బ్యాటరీని ఇందులో పొందుపరిచారు. ఈ ఫోన్‌కి సంబంధించిన ధరలను సైతం ఆ సంస్థ ప్రకటించింది. 
 
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ధర రూ.14,990 ఉండగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,990గా ఉంది. ఇక 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.17,990గా నిర్ణయించారు. 
 
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 11వ తేదీ నుండి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఐసీఐసీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి రూ.750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు జియో కస్టమర్‌లకు రూ.6వేలు విలువైన ప్రయోజనాలు లభిస్తాయి.
 
వివో జడ్1ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు:
6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 
2340 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 
4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 
 
16, 8, 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 
ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments