Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాతో కొత్త ప్రచ్ఛన్న యుద్ధం చేయాలని కోరుకోవట్లేదు.. కానీ..?: జో-బైడెన్

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (11:24 IST)
చైనాతో కొత్త ప్రచ్ఛన్న యుద్ధం చేయాలని తాము కోరుకోవడం లేదని అంటూనే అమెరికా అధినేత జో-బైడెన్ బెదిరింపులకు దిగారు. జి-7 సదస్సు ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నాటో సమావేశంలో పాల్గొనేందుకు కార్నివాల్‌ నుంచి నేరుగా సోమవారం నాడిక్కడకు చేరుకున్నారు. ట్రంప్‌ నాటోను పనికిరాని సంస్థ అంటూ పక్కన పెడితే, నాటోలో అమెరికా తిరిగి చేరుతున్నదని బైడెన్‌ చెప్పారు. 
 
చైనాను కట్టడి చేసేందుకు నాటో సన్నద్ధంగా ఉండాలని బైడెన్‌ అన్నారు. 72 ఏళ్ల ఈ కూటమికి అమెరికా దన్నుగా ఉంటుందని చెప్పారు. కాగా రష్యాతో కలసి చైనా తన సైన్యాన్ని ఆధునీకరించుకోవడం, అణ్వా యుధాలను సమకూర్చుకుంటూ తమతో పోటీపడాలని చూస్తే ఊరుకునేది లేదని సంపన్న దేశాల ఆధ్వర్యంలోని సైనిక కూటమి నాటో బెదిరించింది. 
 
నాటో నేతల సమావేశంలో భాగంగా ఈ కూటమి అధిపతి జీన్స్‌ స్టాల్టెన్‌బర్గ్‌ మాట్లాడుతూ, మిలిటరీ, రక్షణ సాంకేతిక పరిజ్ఞాన పరంగా నాటోకు సరి సమంగా బలం పెంచుకోవాలని చైనా యత్నిస్తోందని, దీనిని తాము ఎంతమాత్రం సహించబోమన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత కమ్యూనిస్టు ప్రాబల్యం విస్తరించకుండా అడ్డుకునేందుకు అమెరికా, యూరోపియన్‌ దేశాలు కలసి ఈ రాజకీయ, సైనిక కూటమిని ఏర్పాటు చేశాయి. కాగా ప్రస్తుతం ఈ కూటమిలో 30 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments