అమెరికా అధ్యక్షుడు జో బైడెన్... మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలపై సమీక్ష చేస్తున్నారు. ఇందులోభాగంగా, ట్రంప్ ప్రభుత్వం చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. చైనాకు చెందిన టిక్‌టాక్, విచాట్ యాప్‌లపై విధించిన నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎత్తివేశారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు.
కరోనా మొదటి దశ మహమ్మారి ప్రబలిన వెంటనే చైనాకు వ్యతిరేకంగా అమెరికా అనేక నిర్ణయాలను తీసుకుంది. వీటిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పునఃసమీక్ష చేపట్టినట్లు వైట్‌హౌస్ వర్గాలు ధృవీకరించాయి. టిక్ టాక్ యాప్‌తోపాటు విచాట్ తదితర యాప్‌లలో భద్రతాపరమైన అంశాలను వాణిజ్య విభాగం క్షుణ్ణంగా పరిశీలించిన మీదట వాటిపై నిషేధం ఎత్తివేశారు.
నిజానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలను జో బైడెన్ అధ్యక్షుడిగాఎన్నికైన తర్వాత రద్దు చేసుకుంటూ వస్తున్నారు. ఇదే కోవలోనే టిక్‌టాక్, విచాట్ యాప్స్‌పై విధించిన నిషేధాన్ని కూడా బైడెన్ ఎత్తివేశారు. అమెరికా విదేశాంగ వాణిజ్య విభాగం టిక్‌టాక్‌పై భద్రతపరమైన అంశాలను తాజాగా వాణిజ్య విభాగం ఓ కన్నేసి ఉంచనుంది.