Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెస్టారెంట్లోనే పుట్టిన పాప.. జీవితాంతం ఫుడ్ ఫ్రీ.. ఇంకా ఉద్యోగం కూడా!

ఆ పాప రెస్టారెంట్లో పుట్టింది. అంతే ఇక బంపర్ ఆఫర్ కొట్టేసింది. జీవితాంతం ఆ రెస్టారెంట్‌లో ఉచితంగా భోజనం చేసే అవకాశాన్ని కొట్టేసింది. అంతేకాదు ఆ హోటల్‌ ఆ బుజ్జిపాపకు ఉద్యోగం ఆఫర్ కూడా ఇచ్చింది. వివరాల్

Webdunia
గురువారం, 26 జులై 2018 (15:52 IST)
ఆ పాప రెస్టారెంట్లో పుట్టింది. అంతే ఇక బంపర్ ఆఫర్ కొట్టేసింది. జీవితాంతం ఆ రెస్టారెంట్‌లో ఉచితంగా భోజనం చేసే అవకాశాన్ని కొట్టేసింది. అంతేకాదు ఆ హోటల్‌ ఆ బుజ్జిపాపకు ఉద్యోగం ఆఫర్ కూడా ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 17వ తేదీన టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఉన్న చిక్ ఫిల్ ఎ రెస్టారెంట్‌కు రాబర్ట్ గ్రీఫిన్, మ్యాగీ దంపతులు వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. 
 
అదే సమయంలో మ్యాగీకి పురిటి నొప్పులు రావడంతో రెస్ట్ రూమ్‌కు వెళ్లారు. తన స్నేహితుడి కారులో పిల్లలను ఇంటికి పంపించిన రాబర్ట్... రెస్ట్ రూమ్‌లో భార్యపక్కనే ఉండి సపర్యలు చేశాడు. పండంటి పాపాయికి జన్మనిచ్చింది మ్యాగీ. 
 
రెస్టారెంట్లోనే మ్యాగీ బిడ్డకు జన్మనివ్వడంతో.. ఆ ఇద్దరి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చిన ఎమర్జెన్సీ వెహికిల్‌లో మ్యాగీని ఆస్పత్రికి తరలించారు. తమ హోటల్‌లో పాప పుట్టినందుకు యాజమాన్యం తనకు లైఫ్ లాంగ్ ఫుడ్ ఫ్రీ అని, తను పెరిగి పెద్దయ్యాక తమ రెస్టారెంట్‌లోనే ఉద్యోగం కూడా కల్పిస్తామని పేర్కొంది. దీంతో ఈ విషయాన్ని రాబర్ట్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ చిట్టితల్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments