Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థితో టీచర్ వికృత చర్యలు.. క్యాబిన్‌కు పిలిచి అభ్యంతరకంగా ప్రవర్తించాడు..

సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. విద్యార్థులతో సృష్టికి విరుద్ధంగా లైంగిక వాం

Webdunia
గురువారం, 26 జులై 2018 (15:25 IST)
సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. విద్యార్థులతో సృష్టికి విరుద్ధంగా లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. హైస్కూలు ఉపాధ్యాయుడు విద్యార్థులతో వికృతంగా ప్రవర్తించిన సంఘటన హైదరాబాద్‌ రాంనగర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాంనగర్‌ హైస్కూల్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజు గత మూడు రోజులుగా ఏడవ తరగతి విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో సదరు విద్యార్థి స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరిస్తున్నాడు. దీంతో ఆ విద్యార్థి తండ్రి కుమారుడిని బలవంతంగా పాఠశాలకు తీసుకురాగా ఏడుపు మొదలుపెట్టాడు. ఏమైందని గట్టిగా నిలదీయగా అడ్మినిస్ట్రేటర్‌ రాజు గత మూడు రోజులుగా తన క్యాబిన్‌కు తనను పిలిపించుకుని అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నట్లు నిజం చెప్పేశాడు. 
 
దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు టీచర్‌పై దాడి చేశారు. రాజు పారిపోగా, తొమ్మిదో తరగతికి విద్యార్థిపై కూడా అతను ఇదే విధంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం