యేడాదికి రూ.30 కోట్ల జీతం.. మన హైదరాబాద్ నగరంలోనే...
సాధారణంగా రూ.కోట్లలో వేతనాలు పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఉంటాయి. కానీ, హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలో పని చేసే ఓ మహిళ ఏకంగా రూ.30 కోట్ల వేతనాన్ని అందుకుంటోంది. హైటెక్ సిటీలో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీలో
సాధారణంగా రూ.కోట్లలో వేతనాలు పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఉంటాయి. కానీ, హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలో పని చేసే ఓ మహిళ ఏకంగా రూ.30 కోట్ల వేతనాన్ని అందుకుంటోంది. హైటెక్ సిటీలో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీలో ఆమె పని చేస్తూ భారీ మొత్తంలో వేతనం అందుకుంటోంది. ఈ విషయాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. అంతేనా, తెలంగాణ, ఏపీ రాష్ట్రంతో కలిపి.. వ్యక్తిగత ఆదాయం కింద అత్యధిక పన్ను కడుతున్న మహిళగా గుర్తింపు పొందింది.
ఒక యేడాదికి ఆమె అందుకుంటున్న రూ.30 కోట్ల జీతం నుంచి.. 30 శాతం అంటే అక్షరాల 9 కోట్ల రూపాయలు ఆదాయపన్ను చెల్లించారు. వ్యక్తిగతంగా అత్యధిక ఆదాయ పన్ను చెల్లించిందీ ఈమేనని తెలంగాణ, ఏపీ ప్రాంతీయ ఆదాయ పన్నుశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎస్పీ చౌదరి వెల్లడించారు. గోప్యత కారణాల వల్ల ఆమె వివరాలు వెల్లడించలేం అని ప్రకటించారు.
గత యేడాది కూడా ఆమే అత్యధిక పన్ను చెల్లింపుదారుగా నిలిచిందని తెలిపారు. గంటకే లక్షల్లో జీతం ఇచ్చే స్థాయిలో హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు కొలువుదీరి ఉండటం అంతర్జాతీయంగా గుర్తింపురావటమే అంటున్నారు. ఇంత పెద్ద జీతాలు చెల్లిస్తున్న కంపెనీలు మరింత విస్తరణగా.. నైపుణ్యం కలిగి ఉన్న వారిని తీసుకోవటానికి అడుగులు వేస్తున్నాయి.
కాగా, ఆమె వార్షిక వేతనం రూ.30 కోట్లు అయితే, ఒక నెలకు రూ.2.5 కోట్లు. ఈ లెక్కన రోజుకి రూ.8 లక్షలు.. రోజుకి 8 గంటలు పని అనుకుంటే.. గంటకు లక్ష రూపాయలు జీతంగా తీసుకుంటుంది. గంటకి లక్ష రూపాయల జీతమా అని నోరెళ్లబెట్టొద్దు.. ఇది లెక్కలు చెబుతున్న నిజం.