Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శోభనం రాత్రి భర్తతో పాటు అతని స్నేహితుడు.. భార్యకు షాక్..!

పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిన ఒక వ్యక్తి ఏ భర్త చేయని విధంగా ప్రవర్తించాడు. తన భార్యను ఏకంగా స్నేహితుల దగ్గరకు పంపించాలని చూశాడు. పెళ్ళయిన రోజే శోభనం గదిలో అతనితో పాటు స్నేహితుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో భార్యకు షాక్. ఇదంతా ఎక్కడో కాదు హైదరాబాద్ నగర

Advertiesment
శోభనం రాత్రి భర్తతో పాటు అతని స్నేహితుడు.. భార్యకు షాక్..!
, మంగళవారం, 17 జులై 2018 (16:57 IST)
పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిన ఒక వ్యక్తి ఏ భర్త చేయని విధంగా ప్రవర్తించాడు. తన భార్యను ఏకంగా స్నేహితుల దగ్గరకు పంపించాలని చూశాడు. పెళ్ళయిన రోజే శోభనం గదిలో అతనితో పాటు స్నేహితుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో భార్యకు షాక్. ఇదంతా ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలో జరిగింది.
 
హైదరాబాద్ పాతబస్తీలోని నివాసముంటున్న సలీమ్‌కు అదే ప్రాంతానికి చెందిన మరో యువతికి వివాహమైంది. సలీమ్‌కు ముందు నుంచి చెడు వ్యసనాలు ఎక్కువ. స్నేహితులతో కలవడం.. అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం సలీమ్‌కు అలవాటు. పెళ్ళయిన తరువాత కూడా సలీమ్ చదువుకోవాలని తల్లిదండ్రులు ఆస్ట్రేలియాకు అతన్ని పంపారు. అయితే అక్కడ కూడా సలీమ్ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం మానలేదు. 
 
అసలు విషయానికొస్తే వివాహమైన మొదటిరోజు రాత్రి తన స్నేహితుడు చాంద్‌తో కలిసి కూర్చున్నాడు సలీమ్. ఇతను నా స్నేహితుడే... ఏమీ కాదు... కూర్చో అంటూ తన భార్యను బలవంతంగా కూర్చోబెట్టాడు. మన శోభనం ప్రారంభమవగానే నా స్నేహితుడు వెళ్ళిపోతాడంటూ ఆమెను దగ్గరకు తీసుకోవడం ప్రారంభించాడు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా విదిలించుకుంది. 
 
నీ స్నేహితుడిని బయటకు పంపేయ్ అంటూ గట్టిగా అరిచింది. దీంతో సలీమ్, స్నేహితుడు చాంద్‌ను బయటకు పంపేశాడు. ఆ తరువాత వారం రోజులకే ఆస్ట్రేలియాకు వెళ్ళాడు సలీమ్. అక్కడి నుంచి భార్యతో వీడియో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. వీడియో చాటింగ్‌లో నగ్నంగా కనిపించమంటూ ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆమె నగ్నంగా వీడియో కెమెరా వద్దకు వచ్చేది. ఈ వీడియోలను రికార్డ్ చేసి తన స్నేహితులకు పంపాడు సలీం. 
 
సలీం భార్యను నగ్నంగా చూసిన స్నేహితులు ఆమెతో కోరిక తీర్చుకోవాలని అనుకున్నారు. విషయాన్ని సలీంకే చెప్పేశారు. ఒక్కొక్కరికి అవకాశం ఇస్తానని చెప్పిన సలీం ఆస్ట్రేలియా నుంచి తిరిగి ఇంటికి వచ్చి భార్యకు కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఇలా మొదటిసారి సలీమ్ స్నేహితుడు చాంద్‌కు, ఆ తరువాత మరో ఇద్దరు ఇలా ముగ్గురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వామి అగ్నివేష్‌పై దాడి ... కిందపడేసి చితకబాదారు...