Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నుంచి పావురం.. 13వేల కి.మీ ఎగురుతూ వచ్చింది.. చంపేయాలని..?

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (10:13 IST)
Pigeon
అమెరికా నుంచి పావురం వచ్చింది.. అయితే ఆస్ట్రేలియా చంపేయాలని అనుకుంటోంది. ఇందుకు కారణం.. ఏదైనా వ్యాధి వ్యాపిస్తోందనే భయం. అవును.. చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనాతో ప్రపంచ దేశాలు నానా తంటాలు పడుతున్న వేళ.. అమెరికా నుంచి 13వేల కిలోమీటర్ల దూరం ఎగురుతూ వచ్చిన రేసు పావురాన్ని ఆస్ట్రేలియా చంపేందుకు సిద్ధమవుతోంది. పావురం రాకతో ఏదైనా వ్యాధి సంక్రమిస్తుందోనని అధికారులు జడుసుకుంటున్నారు.  
 
పసిఫిక్ మహాసముద్రం మీదుగా 13 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆస్ట్రేలియా వచ్చిన ఈ పావురం, మెల్బోర్న్‌లోని కెవిన్ సెల్లి-బర్డ్ అనే వ్యక్తి ఇంటి పెరట్లో వాలింది. డిసెంబరు 26న బాగా అలసిపోయిన స్థితిలో ఉన్న ఆ పావురాన్ని గుర్తించిన సెల్లి-బర్డ్ ఆహారం అందించే ప్రయత్నం చేశాడు. 
 
అయితే సహజంగా కనిపించే అడవి పావురాలకు భిన్నంగా కాలికి రబ్బరు బ్యాండ్‌తో ఎంతో అందంగా కనిపిస్తున్న ఆ పందెం పావురాన్ని ఆస్ట్రేలియన్లు సులభంగానే గుర్తించారు. అది విదేశీ పక్షి అని, దాని కారణంగా ఆస్ట్రేలియాలో ప్రమాదకర వైరస్‌లు వ్యాపించే అవకాశం ఉందని ఆస్ట్రేలియా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని చంపేయడమే శ్రేయస్కరం అని తీర్మానించారు.
 
కాగా, అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో గత అక్టోబరులో నిర్వహించిన పావురాల పందెం నుంచి ఓ పావురం ఆచూకీ లేకుండా పోయిందని వెల్లడైంది. ఇప్పుడా పావురమే సముద్ర మార్గంలో ఒక సరకు రవాణా ఓడపై వాలి ఇంతదూరం ప్రయాణించి ఆస్ట్రేలియా వచ్చినట్టు భావిస్తున్నారు.
 
దీనిపై ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ వర్గాలు స్పందిస్తూ, ఆ పావురాన్ని ఆస్ట్రేలియాలో ఉండేందుకు అంగీకరించలేమని, దాని కారణంగా దేశ ఆహార భద్రత, అటవీ పక్షిజాతుల జనాభా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా, దేశ పౌల్ట్రీ పరిశ్రమకు, ఇక్కడి పక్షిజాతుల ఆరోగ్యానికి ప్రత్యక్ష ముప్పుగా పరిణమించిందని వివరించింది. 
 
ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న పక్షి ఫ్లూ కారణంగా ఆస్ట్రేలియాలో కూడా ఆందోళన పెరిగింది. అమెరికాకు ఎన్నికైన అధ్యక్షుడు జో బిడెన్ పేరు మీద పావురానికి పేరు పెట్టారు. ఇంకా ఈ పావురాన్ని చంపేయాలని ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ అధికారులు ప్లాన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments