Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ హాసన్ పార్టీ అసెంబ్లీ టిక్కెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (17:11 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దించనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసిన కమల్ హాసన్ ఎన్నికలతో పాటు.. తాజా రాజాకీయాలపై చర్చించారు.
 
మరోవైపు, అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. దీంతో ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌తో పాటు పార్టీల బ‌లాన్ని మ‌రింత పెంచుకోవ‌డానికి కీల‌క నేత‌లంతా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. కమల్ హాసన్ కూడా ఇదే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. త‌మిళ‌నాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తున్నారు.
 
ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఓ ష‌ర‌తు పెట్టారు. త‌మ‌ పార్టీ నుంచి పోటీ చేయాల‌నుకుంటోన్న‌ అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని, వారు దరఖాస్తు రుసుముగా రూ.25 వేలు చెల్లించాల‌ని పేర్కొన్నారు. పార్టీయేతర నేత‌లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 
 
త‌మిళ‌నాడులోని 234 నియోజ‌క వ‌ర్గాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఒక్క తమిళనాడులోనే కాకుండా రాష్ట్ర హోదా కలిగిన పుదుచ్చేరిలో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని, అక్కడ కూడా పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments