తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 36మంది మృతి.. 72మందికి తీవ్రగాయాలు

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (10:49 IST)
Taiwan
తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగ మార్గం గుండా వెళ్తున్న రైలు పట్టాలు తప్పి సొరంగా మార్గాన్ని ఢీకొంది. దీంతో చాలా మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదం తేవాన్‌లో చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున రైలు పట్టాలు తప్పి సొరంగ మార్గాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. 
 
అలాగే 72 వరకు గాయపడినట్లు రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొందరు రైలులో చిక్కుకోవడంతో వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కాగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ రైలులో 350 వరకు ఉన్నారు. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, రెస్య్కూ టీమ్‌ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో రైలు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
 
అయితే మృతుల సంఖ్య 36కు పైగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్లో పెద్ద ఎత్తున రోధనలతో మిన్నంటాయి. ప్రమాదం నుంచి రక్షించాలంటూ ప్రయాణికులు కేకలు వేశారు. కొందరు రైల్లో చిక్కుకోవడంతో వారిని బయటకు తీయడం అధికారులకు కష్టంగా మారింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments