Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాతో భారత్ యుద్ధమే... 20 రోజుల్లో చేతులు ఖాళీ... అయినా...

సిక్కిం సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలోనూ, చైనా-భారత్ దేశాల నాయకులు చేస్తున్న ప్రకటనలను చూస్తే భారత్-చైనా యుద్ధానికి తలపడతాయా అంటే... జరగొచ్చేమోనని కొందరు అనుకుంటున్నారు. ఐతే యుద్ధానికి అవకాశం లేదని అగ్రరాజ్యం అమెరికా కొట్టి పారేసింది. ఆ

Webdunia
శనివారం, 22 జులై 2017 (19:02 IST)
సిక్కిం సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలోనూ, చైనా-భారత్ దేశాల నాయకులు చేస్తున్న ప్రకటనలను చూస్తే భారత్-చైనా యుద్ధానికి తలపడతాయా అంటే... జరగొచ్చేమోనని కొందరు అనుకుంటున్నారు. ఐతే యుద్ధానికి అవకాశం లేదని అగ్రరాజ్యం అమెరికా కొట్టి పారేసింది. ఆ దేశాలు రెండూ కూర్చుని మాట్లాడుకుంటాయనీ, పైగా భారత జాతీయ సలహాదారు అజిత్ దోవల్ బ్రిక్స్ ఆధ్వర్యంలో చైనా రాజధాని బీజింగులో జరుగనున్న బహుపాక్షిక భద్రతా చర్చల్లో పాల్గొనబోతున్నారు కనుక యుద్ధం రాదని తేల్చింది. 
 
చైనా కారిడార్ నిర్మించేందుకు అక్రమంగా భారత భూభాగంలోకి 220 కి.మీ చొచ్చుకు రావడంపైన వివాదం తలెత్తింది. అక్కడ వున్న బంకర్లను పేల్చేసి ముందుకు చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నం చేయడంతో భారత సైనికులు నిలువరించారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అరుణ్ జైట్లీ సైతం సీరియస్ అయ్యారు. 1962 నాటి భారత్ కాదని గుర్తు చేశారు. దీనికి సమాధానంగా చైనా కూడా అవును... తాము కూడా 1962 నాటి చైనా కాదని రివర్స్ ఎటాక్ చేసింది. 
 
దేశం కోసం ఎంతటివరకైనా వెళ్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇదిలావుంటే మన దేశానికి చైనాతో యుద్ధం వస్తే మందుగుండు సామగ్రి కేవలం 20 రోజుల్లో ఖాళీ అయిపోతుందట. ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలో తెలిపింది. అంతేకాదు.. ఈ విషయాన్ని 2013లోనే స్పష్టం చేసినట్లు వెల్లడించింది. కాబట్టి యుద్ధం అంటూ వస్తే సైనికుల వద్ద ఆయుధ సామగ్రి 20 రోజుల్లో ఖాళీ అయిపోతుందన్నమాట. 
 
ఐతే ప్రత్యామ్నాయ మార్గాలున్నాయనుకోండి. కానీ వాటిని వినియోగిస్తే ఇక ప్రపంచం వినాశనమే. మరి ఇలా రచ్చ చేసే వారి విషయంలో ఏం చేయాలన్నది అంతర్జాతీయ సమాజం ఓ నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఇప్పటికే అమెరికా దీనిపై స్పందించింది. భారత్-చైనాలు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనీ, ఇరు దేశాలు పరస్పరం మాటల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments