Webdunia - Bharat's app for daily news and videos

Install App

51 ఏళ్ల మహిళపై అత్యాచారం.. ఆపై ఫోనులో వేధింపులు.. ఎమ్మెల్యే అరెస్ట్

నోటికొచ్చినట్లు మాట్లాడటం.. తమకు తోచింది చేసుకుంటూ పోవడం ప్రజాప్రతినిధుల ఫ్యాషనైపోయింది. ప్రజా ప్రతినిధులై వుండి.. ప్రజలకు రక్షణగా వుండాల్సిందిపోయి... నేరాలకు పాల్పడుతున్నారు.

Webdunia
శనివారం, 22 జులై 2017 (17:53 IST)
నోటికొచ్చినట్లు మాట్లాడటం.. తమకు తోచింది చేసుకుంటూ పోవడం ప్రజాప్రతినిధుల ఫ్యాషనైపోయింది. ప్రజా ప్రతినిధులై వుండి.. ప్రజలకు రక్షణగా వుండాల్సిందిపోయి... నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అత్యాచార కేసులో అరెస్టయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కేర‌ళకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం. విన్సెంట్‌ను 51 ఏళ్ల మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డిన నేరం కింద అరెస్ట్ చేశారు. 
 
ఇంకా అత్యాచారానికి అనంతరం విన్సెంట్ అత్యాచార బాధితురాలిని మానసికంగా వేధించినట్లు సమాచారం. తరచూ ఫోనులో తన భార్యను వేధించేవాడని బాధితురాలి భర్త ఆరోపించాడు. అంతేగాకుండా.. విన్సెంట్ వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కొల్లం సిటీ పోలీసులు వెల్లడించారు.
 
బాధితురాలి ఫిర్యాదు మేర‌కు విన్సెంట్‌ను తిరువ‌నంత‌పురంలో అరెస్ట్ చేశారు. కోవ‌లం నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం.విన్సెంట్‌పై ఐపీసీ 376 ప్ర‌కారం కేసు న‌మోదు చేసిన‌ట్లు కొల్లం సిటీ పోలీసు క‌మిష‌న‌ర్ అజీతా బేగం తెలిపారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments