Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ఫుడ్ అధ్వానంగా వుంది... కాఫీ, టీ, సూప్ తయారీకి మురికి నీటినే?: కాగ్

రైల్వే శాఖ అభివృద్ధికి, ప్రయాణీకుల రాకపోకలకు అత్యాధునిక ప్రమాణాలతో సేవలు అందిస్తున్నామని, రైల్వే స్టేషన్లు, రైళ్లలో నాణ్యమైన ఆహారపదార్థాలనే ప్రయాణీకులకు సరఫరా చేస్తున్నామని ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు గ

Webdunia
శనివారం, 22 జులై 2017 (17:26 IST)
రైల్వే శాఖ అభివృద్ధికి, ప్రయాణీకుల రాకపోకలకు అత్యాధునిక ప్రమాణాలతో సేవలు అందిస్తున్నామని, రైల్వే స్టేషన్లు, రైళ్లలో నాణ్యమైన ఆహారపదార్థాలనే ప్రయాణీకులకు సరఫరా చేస్తున్నామని ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు గొప్పలు చెప్పుకుంటున్నారు. అంతేగాకుండా.. స్వచ్ఛ భారత్‌కు రైల్వే శాఖ పెద్ద పీట వేస్తుందని.. రైల్వే స్టేషన్లలో శుభ్రత వెల్లివిరుస్తుందని సురేష్ ప్రభు ట్విట్టర్లో అప్పుడప్పుడు ఫోటోలు షేర్ చేస్తున్నారు. 

అయితే రైల్వే ఫుడ్ తింటే ప్రస్తుతం రోగాలు తప్పవని.. కలుషిత, పునర్వియోగ ఆహార పదార్థాల అమ్మకం జరుగుతుందని.. గుర్తింపు లేని కంపెనీల వాటర్ బాటిళ్లను అనుమతిస్తున్నారని కంప్ట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌(కాగ్‌) వెల్లడించింది. ఇంకా రైల్వే యంత్రాంగంలోని లొసుగులను కాగ్‌ బయటపెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 
 
రైల్వే ఫుడ్ అధ్వానంగా వుందని.. అది తినడానికి ఏ మాత్రమూ పనికి రాదని కాగ్ తెలిపింది. క్యాటరింగ్‌ సర్వీసుల మేనేజ్‌మెంట్‌లో అనేక లొసుగులు ఉన్నట్టు తేల్చి చెప్పింది. క్యాటరింగ్‌ సర్వీస్‌ యాజమాన్యాల గుత్తాధిపత్యం కూడా ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. ఆహారపదార్థాల నాణ్యతకు సంబంధించి రైల్వేతో కలిసి కాగ్‌ 2016 మార్చిలో తనిఖీలను ప్రారంభించింది. 
 
ఈ తనిఖీల్లో.. చాలా రైల్వేస్టేషన్లలో అమ్మే ఫ్రూట్‌ జ్యూస్‌, కూల్‌డ్రింక్స్‌, బిస్కట్స్‌ తినడానికి ఆమోదయోగ్యంగా లేవు. కలుషిత, పునర్విని యోగ ఆహారపదార్థాలు, కాలం చెల్లిన వాటర్‌ బాటిళ్లు, అదీ గుర్తింపులేని కంపెనీల ఉత్పత్తులను స్టేషన్లు, రైళ్లలో అమ్మేందుకు అధికారులు అనుమతి స్తున్నారు. 11రైల్వే జోన్ల పరిధిలో ఉన్న 21 స్టేషన్లలో శుద్ధమైన తాగునీరు అందుబాటులో లేదు.

22 రైళ్లలో కాఫీ, టీ, సూప్‌ తయారీకి మురికి నీటినే వాడుతున్నారు. 13 రైల్వే జోన్లలోని 33 స్టేషన్ల కిచెన్‌‌లలో పనిచేస్తున్న వారు హ్యాండ్‌ గ్లౌవ్స్‌, క్యాప్‌లు ధరించకుండానే పనిచేస్తున్నారు. కిచెన్‌లలో ఎలుకలు, బొద్దింకలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. కాన్పూర్‌-డిల్లీ ఎక్స్‌ప్రెస్‌, ఇతర రైళ్లలో అమ్ముడవ్వని ఆహారపదార్థాలను రీసైక్లింగ్‌ చేస్తున్నారని కాగ్ నివేదికలో తెలిపింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments