నారింజ రంగులో సీగల్ పక్షి.. రంగు పడింది..

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (18:00 IST)
నారింజ రంగులోని ఓ పక్షిని వైల్డ్‌లైఫ్ హాస్పిటల్ అధికారులు కాపాడారు. ఇదేంటి.. పసుపు పచ్చగా వుందని దాన్ని పరిశీలించారు. ఓ హైవే పక్కన కనిపించిన ఆ పక్షిని తీసుకొచ్చిన అధికారులు.. ఆ రంగును గంటలసేపు పరిశీలించారు. ముందుగా ఆ రంగు ఆ పక్షి రంగేనని అనుకున్నారు. కానీ చివరికి తెలిసిందే. ఆ పక్షి రంగు పసుపు కాదని.. ఆ పక్షి ఏదో కూరలో దొర్లిందని తెలుసుకుని షాకయ్యారు. 
 
పసుపు బాగా దట్టిన వంటకంలో ఆ పక్షి.. దొర్లినట్లుంది. దీంతో ఆ రంగు మొత్తం పక్షి శరీరానికి అంటుకుని.. చివరికి నారింజ రంగుగా మారిందని గుర్తించారు. ఇంకా ఆ పక్షిపై ఏదో వంటకం వాసన రావడంతో ఇక ఆ పక్షిని నీటిలో కడిగి చూశారు. అంతే అధికారులు అనుకున్నది నిజమైంది. పక్షి ఒంటిపై అంటిన పసుపు రంగంతా తొలగిపోయింది. ఆ రంగు తొలగించాక పక్షి అసలు రంగు బయటపడింది. 
 
అనంతరం ఆ పక్షిని పరీక్షించిన వైద్యులు.. అది హాయిగా ఎగరగలిగిందని.. ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. ఆ పక్షి పసుపు లేదా ఏదైనా కూరను తన శరీరానికి దట్టుకుని వుంటుందని వైల్డ్ లైఫ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ పక్షి తెలుపు రంగులో కనిపిస్తుందని.. త్వరలో దాన్ని స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరేలా చేస్తామని వారు తెలిపారు. 
 
ఈ సముద్రపు పక్షి సీగల్ రకానికి చెందిందని.. గత 2016లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుందని.. అప్పట్లో సీగల్ పక్షి చికెన్ టిక్కా మసాలాలో పడి.. రంగును మార్చుకుందని వైల్డ్ లైఫ్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. 
 
ప్రస్తుతం పసుపు రంగుతో కూడిన పక్షిని ఇంగ్లండ్, గ్లోచెస్టర్‌షైర్‌లోని వేల్ వైల్డ్ లైఫ్ హాస్పిటల్ అండ్ రెహాబిలేషన్ సెంటర్ వైద్యులు రక్షించారు. ప్రస్తుతం ఆ పక్షి ఉదర సమస్యలతో బాధపడుతుందని.. త్వరలో కోలుకుంటుందని వెటర్నెరీ నర్సు లూసీ కెల్స్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments