బెక్‌హామ్ ఏంటిది? కుమార్తెకు లిప్ టు లిప్ కిస్ ఇస్తావా?

సోమవారం, 8 జులై 2019 (12:22 IST)
ఫ్రాన్స్ ఆతిథ్యంలో మహిళల ఫుట్‌బాల్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారం లెహార్వే స్టేడియంలో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మ‌హిళ‌ల ఫుట్‌బాల్ టీమ్‌.. నార్వేను ఢీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. 3-0 గోల్స్ తేడాతో నార్వేను ఓడించి.. సెమీ ఫైన‌ల్స్‌కు చేరుకుంది. 
 
ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు ఇంగ్లండ్ సాకర్ దిగ్గ‌జం డేవిడ్ బెక్‌హామ్‌ త‌న ఏడేళ్ల కుమార్తె హార్ప‌ర్‌తో క‌లిసి ఫ్రాన్స్‌కు వెళ్లాడు. లెహార్వే స్టేడియంలో ప్రేక్ష‌కుల మ‌ధ్య‌న కూర్చుని మ్యాచ్‌ను వీక్షించాడు. త‌న దేశ జ‌ట్టు నార్వేను ఓడించి, ఫైన‌ల్స్‌కు చేర‌డంతో ఆనందంలో మునిగిపోయాడు బెక్‌హామ్‌. త‌న ఆనందాన్ని కుమార్తె హార్ప‌ర్‌తో పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆమె పెదాల‌పై ముద్దు పెట్టాడు. అయితే కుమార్తె పెదాలపై ముద్దుపెట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. 
 
బెక్‌హామ్ చ‌ర్య‌ను కొంద‌రు త‌ప్పుప‌డుతుండ‌గా.. మ‌రికొంద‌రు దాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం లేద‌ని కొట్టి ప‌డేస్తున్నారు. ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తుంటార‌ని అంటున్నారు. బెక్‌హామ్‌కు త‌న కుమార్తె హార్ప‌ర్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, అందుకే- తాను ఎక్క‌డికెళ్లినా కుమార్తెను వెంట‌బెట్టుకుని వెళ్తుంటాడ‌ని ఆయన అభిమానులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అఖిల్‌కు జోడీగా నివేదా పేతురాజ్..?