Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాన్ని ఢీకొన్న పక్షుల గుంపు - ఇంజిన్‌లో చెలరేగిన మంటలు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (10:57 IST)
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు పెను ప్రమాదం తప్పింది. నింగిలో దూసుకెళుతున్న విమానాన్ని పక్షుల గుంపు ఢీకొట్టాయి. దీంతో ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దీన్ని గమనించిన పైలెట్.. అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లేదు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 బోయింగ్ విమానం ఒహాయెలోని కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఫీనిక్స్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన 25 నిమిషాలకో ఓ పక్షుల గుంపు విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం కుడి వైపున ఉన్న ఇంజిన్ నుంచి పొగలు వచ్చి, ఆ తర్వాత మంటలు చెలరేగాయి. 
 
దీంతో అప్రమత్తమైన పైలెట్.. విమానాన్ని కొలంబస్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్టు ఎయిర్‌పోర్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత అందులోని ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments