Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రూ.40లక్షల పొగాకు దగ్ధం.. ఎలా?

Advertiesment
ambulance
, మంగళవారం, 14 మార్చి 2023 (11:12 IST)
రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌లో మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి గాయపడి రూ.40 లక్షల విలువైన పొగాకు దగ్ధమైంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.
 
108 అంబులెన్స్‌లో డయాలసిస్‌ కోసం ఒక రోగిని రాజాసాహెబ్‌పేట గ్రామం నుంచి ఆసుపత్రికి తీసుకువెళుతున్నారు. కొంత దూరం వెళ్లగానే డ్రైవర్ తిరుపతిరావు క్యాబిన్‌లో పొగలు రావడం గమనించాడు. వెంటనే అంబులెన్స్‌ను ఆపి సహచరుడు మధుసూధన్‌రెడ్డిని అప్రమత్తం చేశాడు. తరువాతి రోగికి, అతనితో పాటు ఉన్న అతని తల్లికి బండి నుంచి దించేందుకు సాయపడ్డాడు. 
 
షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా చెలరేగిన మంటలు కొద్దిసేపటికే వాహనం మొత్తం వ్యాపించాయి. అంబులెన్స్‌లో ఉంచిన ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ వాహనం నుంచి వెలువడిన మంటలు సమీపంలోని రైతులు పొగాకు నిల్వ చేసిన షెడ్‌పై పడింది. దీంతో ఆ షెడ్‌లోని మొత్తం పొగాకు స్టాక్ బూడిదగా మారింది. దీంతో రూ.40 లక్షల నష్టం వాటిల్లిందని షెడ్డులో పొగాకు నిల్వ ఉంచిన ముగ్గురు రైతులు తెలిపారు.
 
షెడ్డు దగ్గర నిలబడిన వ్యక్తికి కూడా ఈ ఘటనతో గాయాలైనాయి. అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుదుచ్చేరి ప్రజలకు శుభవార్త - గ్యాస్ బండపై రూ.300 రాయితీ