ఇరాక్‌లో అమెరికా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో అమెరికా సాయుధ దళాలు ఇరాక్‌లోని ఫలూజాలో యుద్ధవిమానాలతో బాంబుల వర్షం కురిపించాయి.
ఈ దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఫలూజా నుంచి వాహనాల్లో వెళుతుండగా ఉగ్రవాదులపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో 40 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఉగ్రవాదులకు ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణ నష్టం అధికంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు... ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు వద్ద జరిపిన ఆత్మాహుతి దాడికి పాల్పుడిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.