Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడవలొద్దు.. ఇంటికిరా కలిసుందామన్నాడు.. ఫ్రెండ్స్‌తో కలిసి భార్యాబిడ్డల్ని చంపేశాడు.. ఎక్కడ?

భర్త హింస, వేధింపులు తాళలేక ఆ మహిళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా గొడవలొద్దు.. అర్థం చేసుకుని కలిసి ఉందామని చెప్పిన భర్తను నమ్మి ఆ భార్య ఆతని వెంట వచ్చింది. భర్తను నమ్మిన పాపానికి ఆ మహిళ ఇద్దరు చిన్

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (10:05 IST)
భర్త హింస, వేధింపులు తాళలేక ఆ మహిళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా గొడవలొద్దు.. అర్థం చేసుకుని కలిసి ఉందామని చెప్పిన భర్తను నమ్మి ఆ భార్య ఆతని వెంట వచ్చింది. భర్తను నమ్మిన పాపానికి ఆ మహిళ ఇద్దరు చిన్నారులతో పాటు తన ప్రాణాలను కోల్పోయింది. ఇంత దారుణానికి పాల్పడిన భర్త మాత్రం కేసు నుంచి తప్పించుకునేందుకు భార్యాపిల్ల మరణాలను ఆత్మహత్యగా చిత్రీకరించేలా మృతదేహాలను రైలు పట్టాలపై పడవేశాడు.
 
గుంటూరు లాలాపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నల్లచెరువు నాగలక్ష్మి(23) కి నాలుగేళ్ల క్రితం పిట్టలవానిపాలెం మండలం ఆలూరికి చెందిన వీర్ల రమేష్‌తో ప్రేమ వివాహం అయింది. వీరికి యశ్వంత్‌(3), ట్వినిష్‌(1) పిల్లలు ఉన్నారు. ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో లాలాపేట పోలీస్‌ స్టేషన్‌లో రమేష్‌పై నాగలక్ష్మి వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది.
 
ఈ నేపథ్యంలో పోలీసులు రమేష్‌కు నాలుగు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారం రోజుల క్రితం రమేష్ భార్య ఇంటికి వచ్చి ఇకపై గొడవలు లేకుండా కలిసి ఉందామని నమ్మబలికాడు. దీంతో భర్త వెంటే వచ్చిన ఆ మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. చిరుతిళ్లు కొనిపెడతానని ముగ్గురిని తీసుకెళ్లి రమేష్ హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తన స్నేహితులతో కలిసి రమేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments