Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదుల ఏరివేతకు ఇస్తే.. భారత్‌పై ప్రయోగిస్తారా?

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (12:03 IST)
పాకిస్థాన్‌కు అమెరికా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉగ్రవాదుల ఏరివేతకు ఇచ్చిన విమానాలతో భారత్‌పై దాడులు చేయడాన్ని అమెరికా మండిపడింది. ఈ విమానాలను దుర్వినియోగం చేయడంపై మరింత సమాచారాన్ని అందజేయాల్సిందిగా పాకిస్థాన్‌కు స్పష్టంచేసింది. 
 
తమతో కుదుర్చుకున్న వినియోగ ఒప్పందాన్ని (ఎండ్ యూజర్ అగ్రిమెంట్‌ను) పాక్ ఉల్లంఘించి ఈ విమానాలను భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించడంతో ఈ సమాచారాన్ని అడిగినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా కాశ్మీర్‌లో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు దిగిన పాకిస్థాన్.. ఈ దాడుల కోసం అమెరికాలో తయారైన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగించిన విషయం తెలిసిందే. 
 
ఈ విషయాన్ని రుజువుచేసి పాక్ బండారాన్ని బట్టబయలు చేసేందుకు గురువారం భారత వాయుసేన (ఐఏఎఫ్) సదరు ఎఫ్-16 నుంచి పాక్ పైలట్లు ప్రయోగించిన అమ్రామ్ క్షిపణి భాగాలను బహిరంగపరిచింది. ఈ పరిణామాల గురించి తమకు తెలుసని, ఎఫ్-16 యుద్ధ విమానాల దుర్వినియోగంపై మరింత సమాచారాన్ని అందజేయాల్సిందిగా పాకిస్థాన్‌కు స్పష్టం చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments