ఎన్నో పోషకాలు కలిగిన చిరుధాన్యాల్లో శెనగలు ఒకటి. వీటిలో ఫోలేట్, మాంగనీస్, ప్రొటీన్, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. అందుకే శెనగలను చాలామంది ఇష్టపడి తింటుంటారు. ముఖ్యంగా ఉడకబెట్టుకుని లాగించేస్తుంటారు. అయితే ప్రతి రోజూ ఉడకబెట్టిన శెనగలను ఓ కప్పు ఆరగించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేంటో ఇపుడు తెలుసుకుందాం.
* ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో శెనగలను భాగం చేసుకోవడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
* మహిళల్లో రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
* సన్నగా ఉండేవారు రోజూ వీటిని ఆరగించడం వల్ల త్వరితగతిన బరువు పెరిగే అవకాశం ఉంది. శరీరంలో కూడా కొవ్వు పెద్దగా పేరుకునిపోదు.
* శెనగలను క్రమం తప్పకుండా ఆరగించడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ అందుతాయి. షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
* అలాగే, మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
* శెనగలు తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు దరిచేరవు.
* రక్త హీనత సమస్యతో బాధపడేవారు ఉడకబెట్టిన శెనగలను తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి.