Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర్యానికి భలే గిరాకీ... 'సరైనోడు'దికి రూ.3.5 కోట్లు, ఎక్కడబ్బా?

బాలీవుడ్‌లో వీర్యదానంపై వచ్చిన 'విక్కీ డోనర్‌' చిత్రం అందరికి తెలిసిందే. దాన్నే 'నరుడా డోనరుడా' పేరుతో తెలుగులోనూ రీమేక్‌ చేశారు. వీర్య దానంపై విక్కీ డోనర్, నరుడా డోనరుడా వంటి సినిమాలు గుర్తుండే వుంటా

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (17:30 IST)
బాలీవుడ్‌లో వీర్యదానంపై వచ్చిన 'విక్కీ డోనర్‌' చిత్రం అందరికి తెలిసిందే. దాన్నే 'నరుడా డోనరుడా' పేరుతో తెలుగులోనూ రీమేక్‌ చేశారు. వీర్య దానంపై విక్కీ డోనర్, నరుడా డోనరుడా వంటి సినిమాలు గుర్తుండే వుంటాయి. సంతానోత్పత్తి కోసం సామర్థ్యంలేని దంపతులకు వైద్యులు మరొకరి వీర్యం లేదా అండాన్ని కలిపి గర్భధారణ చేస్తుంటారు. ఈ తరహా సంతానోత్పత్తికి ప్రస్తుతం ఆదరణ బాగానే పెరుగుతోంది. దీంతో వీర్యం దానం చేసేవారి కోసం ఆస్పత్రులు ఎదురుచూస్తున్నాయి. వీర్యం, అండం దానం చేసేవారికి అమెరికాకు చెందిన ఓ ఆస్పత్రి భారీ ఆఫర్ చేసింది.
 
జన్యుపరంగా సరైన వ్యక్తి ఇచ్చే వీర్యానికి రూ.3.5కోట్లు ఇస్తామని ప్రకటించింది. వీర్యం.. అండం దానం చేసిన వారి చదువు సంధ్యలు.. కుటుంబ నేపథ్యం.. ఆరోగ్య పరిస్థితి.. డీఎన్‌ఏలను పరిశీలిస్తారు. ఆయా అంశాల్లో ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటే వారి నుంచి వీర్యం.. అండం సేకరిస్తారు. అందుకు ప్రతిగా రూ.3.5కోట్ల రూపాయలు అందిస్తామని ప్రకటించారు. 
 
జన్యువుల ప్రభావం వల్ల తల్లిదండ్రులు ఏవిధంగా ఉంటే పిల్లలు ఆ విధంగానే ఉంటారు. ఎవరి పిల్లలు వారిలాగే జీవిస్తారు. అందుకే అమెరికాలోని డెలావర్‌ ప్రాంతంలోని ప్యురెనెటిక్‌ ఎల్‌‌ఎల్‌‌‍సీ సంస్థ నాణ్యమైన.. మేటి వీర్యం.. అండం కనుగొనాలని భావించి ప్రకటన చేసింది. పురుషులు, మహిళలు మేటి వీర్యంతో పాటు అండాన్ని దానం చేయాలని పిలుపు నిచ్చింది. ఇందుకోసం ఆస్పత్రికి సంబంధించిన సంస్థ వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments