Webdunia - Bharat's app for daily news and videos

Install App

దౌత్యపరంగా పాక్‌ను ఏకాకిని చేస్తాం.. అమెరికా హెచ్చరిక

ఉగ్రమూకలకు మద్దతు ఇచ్చే విషయంలో పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోవాలని అమెరికా మరింతగా ఒత్తిడి చేస్తోంది. లేనిపక్షంలో ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా అధ్యక్షుడు ట్రంప్‌ సిద్ధంగా ఉన్నారని అమెరికా రక్షణ మంత్ర

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (06:34 IST)
ఉగ్రమూకలకు మద్దతు ఇచ్చే విషయంలో పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోవాలని అమెరికా మరింతగా ఒత్తిడి చేస్తోంది. లేనిపక్షంలో ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా అధ్యక్షుడు ట్రంప్‌ సిద్ధంగా ఉన్నారని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్‌ స్పష్టం చేశారు. 
 
దౌత్యపరంగా పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేస్తామని కూడా మాటిస్‌ హెచ్చరించారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో నాటో ఇతర అమెరికా మిత్రపక్ష హోదాను కూడా పాక్‌ కోల్పోవాల్సి ఉంటుందని సైనిక సేవల సెనేట్‌ కమిటీ ముందు మాటిస్‌ తేల్చి చెప్పారు. 
 
దక్షిణాసియాలో సుస్థిరత కోసం ఆ దేశం చర్యలు తీసుకోకుంటే తమ వద్ద అనేక శక్తివంతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ విషయంలో తాము విజయవంతం అవుతామని మాటిస్‌ వివరించారు. ముష్కర మూకలపై చర్యలు తీసుకునే విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి వస్తే పాకిస్థాన్‌కే మేలు జరుగుతుందని అన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments