Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఈసారి నిశ్శ‌బ్ద‌ దీపావళి..? బాణసంచాపై మళ్లీ నిషేధం!

దేశ రాజధాని దిల్లీలో గతేడాది బాణసంచాపై విధించిన నిషేధాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనుం

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (06:27 IST)
దేశ రాజధాని దిల్లీలో గతేడాది బాణసంచాపై విధించిన నిషేధాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనుంది. 
 
పండగలు, ప్రత్యేక సందర్భాల్లో పెద్దమొత్తంలో బాణసంచా ఉపయోగిస్తుండటంతో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొంటూ గతేడాది నవంబర్‌లో ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో బాణసంచాపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. 
 
బాణసంచాలను విక్రయించే టోకు, చిల్లర వ్యాపారుల లైసెన్సులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. కాలుష్యం దృష్ట్యా బాణసంచా విక్రయ లైసెన్సులను సగానికి తగ్గించేలా చూడాలని పోలీసులను ఆదేశించింది. 
 
తాజాగా ఈ నిషేధాన్ని తిరిగి కొనసాగించాలని కోరుతూ అర్జున్‌ గోపాల్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments