Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐరాసలో భారత్‌కు మా పూర్తి సహకారం : అమెరికా

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (17:05 IST)
జైష్ ఏ మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత తీర్మానాన్ని చైనా నాలుగోసారి కూడా వ్యతిరేకించడంతో అమెరికా మండిపడుతోంది. మసూద్ అజార్‌ను తప్పనిసరిగా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి తీరాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది.


అలా ప్రకటించని పక్షంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో శాంతికి భంగం వాటిల్లుతుందని అభిప్రాయపడింది. బుధవారం నాడు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ముఖ్యమైన సమావేశం జరగనున్న నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది.
 
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి రాబర్ట్ పల్లాడినో పేర్కొన్నారు. జైషే మహ్మద్ అనేక ఉగ్ర దాడులకు పాల్పడిందని, ఆ దాడుల వల్ల అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

ఉగ్రవాదంపై భారత్‌తో కలిసి పోరాడే విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని స్పష్టం చేసారు. ఐక్యరాజ్యసమితిలో కూడా భారత్‌తు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా ఇప్పటికి 3 సార్లు ప్రతిపాందించగా చైనా ప్రతిసారీ ఈ విషయంలో అడ్డు తగులుతూ వచ్చింది. ఈ విషయంపై స్పందించిన పల్లాడినో శాంతి స్థాపనకు అమెరికా, చైనా కలిసి పని చేస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకుడు శంకర్‌తో మా జర్నీ అలా మొదలైంది : నిర్మాత దిల్ రాజు

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments