Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

ఐవీఆర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (14:05 IST)
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో టర్కీ పాకిస్తాన్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తోందని పేర్కొంటూ వార్తలు వచ్చాయి. సైనిక సామగ్రిని అందించడానికి టర్కిష్ C-130E హెర్క్యులస్ కరాచీలో దిగిందని ఆ నివేదికలు తెలిపాయి. ఈ వార్త కాస్తా వైరల్ అయ్యింది. అంతేకాదు... సుమారు ఆరు C-130E విమానాలు పాకిస్తాన్‌లో దిగాయని కూడా పేర్కొన్నాయి.
 
అయితే ఈ వార్తలను టర్కీ తోసిపుచ్చింది. అవన్నీ ఉత్తమాటలేననీ, తమ దేశం టర్కీ నుండి ఒక కార్గో విమానం ఇంధనం నింపేందుకు మాత్రమే పాకిస్తాన్‌లో దిగిందని ప్రెసిడెన్సీ డైరెక్టరేట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ చెప్పిందని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ‘టర్కియే పాకిస్తాన్‌కు ఆయుధాలతో నిండిన ఆరు విమానాలను పంపుతున్నట్లు’ కొన్ని మీడియా సంస్థలలో వ్యాపించే వాదనలు నిజం కాదని టర్కిష్ అధికారులు సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో తెలిపారు.
 
కాగా 2023లో టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఆ సమయంలో భారతదేసం టర్కీకి ఆపన్నహస్తం అందించింది. సాయం అందించిన చేతులకు హాని ఎలా తలపెడతాము అంటూ పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ టర్కీ అధికారి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments