Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమాలియాలో ఉగ్రవాదుల ఘాతుకం.. వైద్యులను కిడ్నాప్ చేసి కాల్చేశారు..

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (16:16 IST)
సోమాలియాలో అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్ షబాబ్‌కు చెందిన తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. తొమ్మిది మంది వైద్యులను ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు. మొదట తొమ్మిది మంది డాక్టర్లను కిడ్నాప్ చేసిన సౌత్ సోమాలియాకు చెందిన ఉగ్రవాదులు ఆ తర్వాత వారిని కాల్చి చంపేశారు. అనంతరం వైద్యుల మృతదేహాలను మిడిల్ షాబెల్లీ ప్రావిన్స్ ప్రాంతంలోని బలాద్ నగరంలో పడేసి వెళ్లారు. దీంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 
 
కాగా, వైద్యులందరూ యువకులేనని, స్థానిక ఆస్పత్రుల్లో పని చేస్తున్నజూనియర్ డాక్టర్లుగా అధికారులు పేర్కొన్నారు. షరియా చట్టం యొక్క తీవ్రమైన సంస్కరణను దేశంలో విధించే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా అనేక దాడులు చేస్తున్న అల్-షాబాబ్ ఉగ్రవాదులు ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశారు. 1990 ప్రారంభంలో వంశ-ఆధారిత సాయుధ సమూహాల మధ్య అంతర్యుద్ధం చెలరేగినప్పటి నుండి సోమాలియా హింస జరుగుతూనే వుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments