Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్‌ లక్ కాయిన్‌తో ఆ వెర్రి వెంగళప్ప చేసిన పనికి విమానాన్ని ఆపేశారు...

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (16:29 IST)
ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు ప్రమాదాలు జరగకుండా సాగాలని లేకుండా గుడ్‌ లక్ కాయిన్‌ను ఓ వెర్రి వెంగళప్ప విమానం ఎడమ వైపు ఇంజిన్‌లోకి విసిరాడు. దీంతో విమాన సిబ్బంది ముప్పు తిప్పలు పెట్టింది. చివరకు ఆ విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా ఆ విమానం నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చైనాకు చెందిన లూ అనే 28 యేళ్ల వ్యక్తి తన భార్య, యేడాది కుమారుడితో కలిసి అన్హుయిలోని విమానాశ్రయంలో లక్కీ ఎయిర్ ఫ్లైట్ 8ఎల్9960 విమానంలో యున్నన్‌కు బయల్దేరేందుకు వచ్చాడు. అతనికి విమానం ఎక్కటం అదే ఫస్ట్ టైమ్. ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు.. ప్రమాదాలు జరగకుండా సాగాలని లేకుండా.. 'గుడ్ లక్ కాయిన్స్'ను విమానం ఎడమ వైపు ఇంజిన్‌లోకి విసిరాడు. 
 
లూ విసిరిన నాణెలు నేరుగా ఇంజిన్‌కి వెళ్లి టర్బైన్‌ను ధ్వంసం చేశాయి. ఇంజిన్ ఫెయిల్ కావడంతో విమానాన్ని నిలిపివేశారు. లూ నిర్వాకానికి విమానంలోని 162 మంది ప్రయాణికులు రోజంతా పడిగాపులుపడాల్సి వచ్చింది. ఇది తెలుసుకున్న విమానాశ్రయం అధికారులు లూను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇంజిన్‌కి నాణెలు విసరడం వల్ల 14.87 లక్షల నష్టం వాటిల్లిందని లక్కీ ఎయిర్ ఆ మొత్తాన్ని లూ నుంచే వసూలు చేస్తామని తెలిపింది. 2017లో కూడా లక్కీ ఎయిర్ సంస్థ ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. 76 ఏళ్ల వృద్ధురాలు విమానం ఇంజిన్‌లోకి గుడ్ లక్ నాణేలు విసిరింది. 
 
అదే ఏడాది చైనాకు చెందిన సదరన్ ఎయిర్ లైన్స్ విమానం ఇంజిన్‌లో కూడా ఓ యువతి నాణేలు విసిరి సిబ్బందిని పరుగులు పెట్టించింది. ప్రయాణాల సమయంలో చైనీయులు గుడ్ లక్ నాణేలను విసురుతుంటారు. దీనివల్ల తమ ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగదనేది వారి విశ్వాసం. అదే ఇప్పుడు వారిని ఇబ్బందుల్లోకి నెడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments