గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం

ఠాగూర్
శుక్రవారం, 10 అక్టోబరు 2025 (15:12 IST)
ఇటీవలి కాలంలో ఎయిరిండియా విమానాలు ప్రమాదాలకు గురికావడం లేదా తరచుగా సాంకేతి సమస్యలు తలెత్తడం జరుగుతోంది. తాజాగా ఓ ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా ఆ విమానంలో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. దీంతో అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని అత్యవసరంగా దుబాయ్‌కు మళ్లించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిరిండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 
 
ఏఐ-154 విమానం వియన్నా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యంగా విమానాన్ని సమీపంలోని దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి, అక్కడ సురక్షితంగా కిందకు దించారు. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. 
 
ఈ ఘటనపై ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ, సాంకేతిక సమస్య తలెత్తినట్టు అనుమానం రావడంతో విమానాన్ని దుబాయ్‌కు మళ్లించాం. అక్కడ విమానానికి అవసరమైన అన్ని తనిఖీలు పూర్తి చేశాం. ఈ ఆలస్యం గురించి ప్రయాణికులకు తెలిజయేసి వారికి అల్పాహారం అందించారు. తనిఖీల అనంతరం విమానం భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8.45 గంటలకు దుబాయ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది అని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

Priyadarshi: ప్రేమంటే లో దోచావే నన్నే.. అంటూ ప్రియదర్శి, ఆనంది పై సాంగ్

Deepika : కల్కి 2, స్పిరిట్ సినిమాలకు క్రూరమైన వర్కింగ్ అవర్స్ అన్న దీపికా

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments