Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కొండ చిలువతో మసాజ్ చేయించుకుంటే ఒళ్లు నొప్పులు మటాష్...

ఎవరైనా ఒళ్లు నొప్పులు, మెడ నొప్పి వంటివి వస్తే మసాజ్ చేయించుకుంటారు. మరికొందరు ఎంజాయ్‌మెంట్ కోసం అమ్మాయిలతో ఆ పని చేయించుకుంటారు. కానీ, జర్మనీకి చెందిన ఓ వ్యక్తి తన వద్దకు వచ్చే కస్టమర్లకు ఏకంగా కొండ

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (11:46 IST)
ఎవరైనా ఒళ్లు నొప్పులు, మెడ నొప్పి వంటివి వస్తే మసాజ్ చేయించుకుంటారు. మరికొందరు ఎంజాయ్‌మెంట్ కోసం అమ్మాయిలతో ఆ పని చేయించుకుంటారు. కానీ, జర్మనీకి చెందిన ఓ వ్యక్తి తన వద్దకు వచ్చే కస్టమర్లకు ఏకంగా కొండ చిలువతో మసాజ్ చేయిస్తున్నారు. వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ.. ఇది పచ్చినిజం. అదేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ డొహ్లన్‌ స్థానికంగా హెయిర్‌ సెలూన్‌ నడుపుతున్నాడు. 13 సంవత్సరాల క్రితం ఓ రోజు పని ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఓ పాము పిల్ల కనిపించింది. సాధారణంగా వేరే వాళ్లయితే వెంటనే చంపేస్తారు. ఫ్రాంక్‌ మాత్రం దానిని జాగ్రత్తగా పెంచాడు. ఆ పాముకు మాంటీ అనే పేరు పెట్టాడు. ఆ తర్వాత తన వెంట ఆ పానును కూడా షాపుకు తీసుకెళుతూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో కొంతకాలానికి అతడికి ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటంటే... ప్రతి రోజూ తాను చేస్తున్న పనిని మాంటీతో చేయిస్తే ఎలా ఉంటుంద‌ని అనుకున్నాడు. అంతే వెంటనే ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ప్రారంభంలో కాస్త జంకినా, తర్వాత స్పందన బాగానే లభించింది. 
 
మాంటీ మెడకే కాకుండా ఒళ్లు నొప్పులకీ మసాజ్‌ చేస్తుంది. మాంటీ శరీరానికి చుట్టుకొని గట్టిగా అదుముతూ మసాజ్ చేస్తుంది. అయితే, ఈ కొండ చిలువ మసాజ్ చేసినందుకు ఫ్రాంక్ పైసా తీసుకోడు. కానీ, దాని ఆహారానికి మాత్రం ఇచ్చినంత విరాళం తీసుకుంటాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

దిలీప్ శంకర్ ఇక లేరు.. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో..?

పూరీ జగన్నాథ్ New Resolution 2025, సోషల్ మీడియా దెయ్యంను వదిలేయండి

Pushpa 2: 23 ఏళ్ల ఖుషీ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2.. టిక్కెట్ల తేడా వుందిగా..!?

ఫతే ప్రచారంలో సోనూ సూద్‌కి పంజాబ్ లో నీరాజనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments