వేగంగా వెళ్తున్న అంబులెన్స్ గుంతలో పడటంతో మెడికల్ మిరాకిల్

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (20:30 IST)
అమెరికాలోని నెబ్రస్కాలో ఒక మెడికల్ మిరాకిల్ జరిగింది. అప్పటిదాకా మామూలుగా ఉన్న ఒక వ్యక్తి ఒక్కసారిగా గుండె పట్టుకొని పడిపోయాడు. దాంతో ఇరుగుపొరుగువారు హుటాహుటిన అంబులెన్సును పిలిపించారు. నిమిషాల్లో అంబులెన్స్ అక్కడకు చేరుకుని పేషెంట్‌ను పరిశీలించారు. అయితే అతని గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటోందని, వెంటనే ఆస్పత్రికి తరలించాలని చెప్పారు.
 
పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి హడావిడిగా బయలుదేరారు. అయితే ఆ అంబులెన్సు మార్గమధ్యంలో ఓ గుంతలో పడటంతో ఆ వాహనం భారీ కుదుపుకు గురైంది. దాంతో అందులో ఉన్నవారు డ్రైవర్‌పై విరుచుకుపడ్డారు. పేషెంట్‌కు ఉన్నప్పుడు ఎలా వెళ్లాలో తెలియదా అని డ్రైవర్‌పై మండిపడ్డారు. తీరా చూస్తే అందులోని పేషెంట్ నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. పేషెంట్ ప్రశాంతంగా లేచి కూర్చోవడంతో షాకైన వారికి ఏం జరిగిందో అర్థం కాలేదు.
 
ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా అంబులెన్సు గుంతలో పడటమే ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడిందని వైద్యులు చెప్పారు. ఆ భారీ కుదుపుతో ఉలిక్కిపడ్డ అతని గుండె మళ్లీ నెమ్మదిగా సాధారణ వేగంలో కొట్టుకోవడం మొదలెట్టిందని, ఇది నిజంగా అద్భుతమన్న వైద్యులు, సాధారణంగా గుండె వేగం పెరిగితే కరెంట్ షాక్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. అమెరికాలోని నెబ్రస్కాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments