Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాన్సర్‌ కణాలను చంపే వైరస్‌ వచ్చేసింది..

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (11:00 IST)
cancer
క్యాన్సర్‌ కణాలను చంపే వైరస్‌ను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. వైద్య చరిత్రలో మరో అద్భుతాన్ని సృష్టించారు. జన్యుమార్పిడి చేసిన వైరస్‌ను క్యాన్సర్‌ కణాల్లోకి జొప్పించి, ఆ కణాలు కుంచించుకుపోయేలా చేశారు. 
 
ఇంగ్లండ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌, రాయల్‌ మార్స్‌డెన్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ కలిసి.. క్యాన్సర్‌ కణాలను చంపేందుకు ఓ వైరస్‌లో జన్యు మార్పులు చేశారు.
 
ఆ వైరస్‌ను క్యాన్సర్‌ కణాలు ఉన్న చోట ఇంజెక్షన్‌ ద్వారా జొప్పించారు.ఆ వైరస్‌.. క్యాన్సర్‌ కణాల పనితీరును దెబ్బతీసి, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేలా చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. యూకేకు చెందిన క్రజైస్టోఫ్‌ వోజ్కోవ్‌స్కీ (39) లాలాజల గ్రంథి క్యాన్సర్‌తో బాధపడేవాడు. అనేక దవాఖానలు తిరిగినా ఫలితం లేకపోయింది. జీవితంపై ఆశ కోల్పోయిన అతడు.. తనపై 'వైరస్‌ చికిత్స' ట్రయల్స్‌ కోసం రాయల్‌ మార్స్‌డెన్‌ వద్ద పేరు నమోదు చేసుకున్నాడు. 
 
దీంతో అతడి శరీరంలోకి వైరస్‌ను ఎక్కించారు. ఆశ్చర్యకరంగా అతడి క్యాన్సర్‌ మాయమైపోయింది. మొత్తం 9 మందిపై ట్రయల్స్‌ నిర్వహించగా ఇప్పటికే ముగ్గురు కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments