Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఏడుగురు మృతి

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (10:00 IST)
Earthquake
ఇండోనేషియా దేశంలో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏడుగురు మరణించగా,  వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇండోనేషియాలోని సులావేసి దీవుల్లో మజేన్‌కు నగర సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. 
 
మాజీనీ దీవుల్లో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. ఈ భూకంపంలో ఒక హోటల్, గవర్నరు కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నాయని విపత్తు సంస్థ అధికారులు చెప్పారు. 
 
భూకంపం తర్వాత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. భూకంపం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ నిలిచిందని అధికారులు చెప్పారు.ఈ భూకంపం వల్ల పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. 2018లో సులవేసిలో సంభవించిన భూకంపం వల్ల వచ్చిన సునామీ వల్ల వేలాదిమంది మరణించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments