Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం.. 22కి చేరిన మృతుల సంఖ్య

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (09:51 IST)
టర్కీ, గ్రీస్‌ను భారీ భూకంపం కుదిపేసింది. టర్కీలో భూకంపం వల్ల మరణించినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం 14 మంది చనిపోగా, ఇప్పుడు ఆ సంఖ్య 22కు చేరింది. భూకంపం కారణంగా 700 మందికిపైగా గాయపడ్డారు. టర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్‌ సముద్రంలో 196 సార్లు భూమి కంపించిందని అధికారులు గుర్తించారు. 
 
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం సమోస్‌లోని గ్రీకు పట్టణం కార్లోవాసికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 7.0గా నమోదయ్యింది. దీని ప్రభావంతో సామోస్‌, ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ వచ్చింది. 
 
టర్కీలోని ఇజ్మిర్‌లో 20కిపైగా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శిథిలాల్లో చిక్కుకున్న బాధితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments