Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీవ్ నగరంపై దాడికి 65 కిమీ పొడవుగల రష్యన్ బలగాలు

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (16:14 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. అయినప్పటికీ రష్యా బలగాలకు ఒక పట్టాన పట్టు చిక్కడం లేదు. దీంతో మరింత భీకరంగా యుద్ధం చేస్తుంది. ఇందులోభాంగా కీవ్ నగరాన్ని నెలమట్టం చేయాలని నిర్ణయించుకుంది. ఈ నగరంలోని ప్రభుత్వ భవాలను లక్ష్యంగా చేసుకుని రష్యా బలాగలు క్షిపణి దాడులు చేస్తుంది. అయినప్పటికీ ఉక్రెయిన్ బలగాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కీవ్ నగరాన్ని ఒక్కసారిగా ముట్టడించి దాడి చేసేందుకు వీలుగా ఈ నగరానికి ఉత్తర దిశలో 65 కిలోమీటర్ల మేర రష్యా బలగాలు  మొహరించివున్నట్టు శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. 
 
ఈ ఫోటోలను నిశితంగా పరిశీలిస్తే, సాయుధ వాహనాలు, ట్యాంకులు, ఫిరంగిదళాలు, ఇతర వాహనాలతో ఈ కాన్వాయ్ వుంది. ఇది మొత్తం 65 కిలోమీటర్ల పొడవుకు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే, దక్షిణ బెలారస్‌లో భూ బలగాల మోహరింపును కూడా ఫోటోలు చూపించాయి.
 
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ను తమ దారికి తెచ్చుకునేందుకు వీలుగా రష్యా ఈ దాడులకు దిగింది. అయితే, ఉక్రెయిన్ బలగాలు రష్యా బలగాలను ధీటుగా ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments