Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో హాట్​ఎయిర్​ బెలూన్ ప్రమాదం.. ఐదుగురు మృతి

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (12:33 IST)
Hot Baloon
అమెరికాలో హాట్​ఎయిర్​ బెలున్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పైలట్​ సహా మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. న్యూ మెక్సికో నగరంలో హాట్​ఎయిర్​ బెలూన్​ విద్యుత్​ తీగలకు తాకడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
 
స్థానిక అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. హాట్​ఎయిర్​ బెలున్​ అదుపుతప్పి ఒక్కసారిగా అక్కడున్న విద్యుత్​ తీగలవైపు దూసుకెళ్లి​ విద్యుత్​ తీగలకు తాకడంతో మంటలు చెలరేగాయి. 
 
బెలూన్ మంటలలో చిక్కుకోవడంతో 100 అడుగల ఎత్తులో నుంచి ముందు బెలూన్​కు ఉన్న గోండోలా నేలకొరిగింది. ప్రమాదం జరిగిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే.. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments