Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో 26 మంది ఎంపీలకు కరోనా వైరస్!

Webdunia
సోమవారం, 10 మే 2021 (10:41 IST)
నేపాల్‌లో 26 మంది ఎంపీలు కరోనా వైరస్ బారినపడ్డారు. పార్ల‌మెంట్ సభ్యులందరికీ మొత్తం రెండు ద‌శ‌ల్లో ప‌రీక్ష‌లు చేయించారు. తొలి దశలో 18 మంది, రెండో దశలో 8 మంది వైరస్‌ బారినపడినట్లు నేపాల్‌ పార్లమెంట్‌ కార్యదర్శి గోపాల్‌నాథ్‌ యోగి తెలిపారు. 
 
క‌రోనా సోకిన ఈ 26 మందిలో న‌లుగురు క్యాబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. దాంతో సోమవారం పార్ల‌మెంట్లో జ‌రుగాల్సిన ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలీ విశ్వాస‌ప‌రీక్ష‌పై ఉత్కంఠ నెల‌కొన్నది.
 
మరోవైపు, ప్రచండ నేతృత్వంలోని నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ కేపీ శ‌ర్మ ఓలి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి ఇవాళ పార్ల‌మెంట్‌లో విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్నారు. 
 
నేపాల్‌ పార్లమెంట్‌లో ప్రస్తుతం 271 మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష‌ నుంచి గట్టెక్కాలంటే కనీసం136 మంది ఎంపీల మద్దతు అవసరం. సీపీఎన్‌-యుఎంఎల్‌కు ప్ర‌స్తుతం 121 మంది సభ్యులు ఉన్నారు. ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15 మంది మద్దతు అవసరం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments